యూఏఈలో భారతీయ వృద్ధుడి మృతదేహం లభ్యం | Indian man's body found in UAE | Sakshi
Sakshi News home page

యూఏఈలో భారతీయ వృద్ధుడి మృతదేహం లభ్యం

Oct 1 2013 3:09 PM | Updated on Sep 1 2017 11:14 PM

అబుదాబిలోని ఎలక్ట్రా స్ట్రీట్లోని ఎల్డరాడొ సినిమా బిల్డింగ్లో 62 సంవత్సరాల వృద్ధుడి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని గల్స్ న్యూస్ మంగళవారం వెల్లడించింది.

అబుదాబిలోని ఎలక్ట్రా స్ట్రీట్లోని ఎల్డరాడొ సినిమా బిల్డింగ్లో 62 సంవత్సరాల వృద్ధుడి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని గల్స్ న్యూస్ మంగళవారం వెల్లడించింది. మృతుడు అతని భార్యతో కలసి దాదాపు ఏడాది కాలంగా ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారని తెలిపింది. మృతుడిని అతడి భార్య సీబీ, భార్యను అతడు జీబీ అని  పిలుచుకునే వారని ఆ అపార్ట్మెంట్ వాసులు తమ విచారణలో వెల్లడించారన్నారు.

 

మృతుడు స్వస్థలం భారత్లోని ఉత్తరప్రదేశ్ అని పోలీసు తెలిపారని పేర్కొంది. అయితే మృతుడి భార్య అబుదాబిలోని ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారని వివరించింది. కాగా మృతుడు కింద పడి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. భారతీయుడు మృతి చెందినట్లు నిన్న ఉదయం స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement