మాదాపూర్‌లో యువతి ఆత్మహత్య కలకలం | Young Woman Commits Suicide In Madhapur | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో యువతి ఆత్మహత్య కలకలం

Jun 28 2018 2:24 PM | Updated on Sep 4 2018 5:44 PM

Young Woman Commits Suicide In Madhapur - Sakshi

నగరంలో విషాదం చోటు చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని మిలాంజ్‌ టవర్‌పై నుంచి దూకి గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి అదే భవనంలోని ఉన్న ప్రైమ్ ఎరా అనే కంపెనీలో పనిచేస్తున్న శ్రావణి( 27)గా గుర్తించారు. ఈరోజు ఉదయం ఆఫీస్‌కు వచ్చిన శ్రావణి, తొమ్మిదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకు​న్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శ్రావణి గత కొన్ని రోజులుగా తీవ్రమైన మనోవేదనకు గురి అవుతోందని, ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. యువతి ఆత్మహత్యతో స్థానికంగా కలకలం రేగింది. 

Advertisement
 
Advertisement
Advertisement