పోకిరీకి యువతి చెప్పుతో సమాధానం.. | Young Woman Attack on Eve Teaser in Hyderabad | Sakshi
Sakshi News home page

పోకిరీపై దాడి

Jan 6 2020 10:10 AM | Updated on Jan 6 2020 10:10 AM

Young Woman Attack on Eve Teaser in Hyderabad - Sakshi

యువతిని అడ్డుకుంటున్న స్థానికులు

గోల్కొండ: తనను వెంబడిస్తున్న పోకిరీకి ఓ యువతి చెప్పుతో బుద్ధి చెప్పిన సంఘటన ఆదివారం  మెహిదీపట్నం ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  అత్తాపూర్‌కు చెందిన ఓ యువతి బైక్‌పై మెహిదీపట్నం వైపు వస్తుండగా, తనను ఓ యువకుడు బైక్‌పై వెంబడిస్తున్నట్లు గుర్తించింది. రేతిబౌలి మీదుగా ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ కార్యాలయం వద్దకు రాగానే ఆమె నడిరోడ్డుపై బైక్‌ను ఆపి  తనను వెంబడిస్తున్న యువకుడి వాహనానికి అడ్డుకుని అతడిపై చెప్పుతో దాడి చేసింది. దీంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో సదరు యువకుడు అక్కడినుంచి పరారయ్యాడు. తనను అడ్డుకున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దుండగుడిని పట్టుకోకపోగా, తనను ఎందుకు ఆపారని నిలదీసింది. 

Advertisement
 
Advertisement
Advertisement