మోదీ పర్యటన..చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత | Young Man Committed Suicide During Modi Chennai Visit | Sakshi
Sakshi News home page

మోదీ చెన్నై పర్యటన..యువకుడి ఆత్మాహుతి

Apr 12 2018 10:58 AM | Updated on Sep 27 2018 8:27 PM

Young Man Committed Suicide During Modi Chennai Visit  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట చర్చనీయాంశమైంది.  చెన్నైలోని ఈరోడ్ కి చెందిన ధర్మలింగం... కావేరి జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరాశకు లోనయ్యాడు. కావేరి బోర్డు ఏర్పాటుపై ప్రధాని స్పందికపోవడంతో మోదీ పర్యటన నిరసిస్తూ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఈ విషయాన్ని తన ఇంటి గోడపై రాసి అనంతరం ధర్మలింగం ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మంటల్లో కాలిపోతున్న యువకుడిని ఇరుగు పొరుగువారు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందాడు. ఈ సంఘటనతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement