మహిళ అనుమానాస్పద మృతి

Women Suspicious death in Tamil Nadu - Sakshi

చెన్నై ,టీ.నగర్‌: తిరునెల్వేలిలో మహిళ ఆదివారం అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందింది. తిరునెల్వేలి వాషర్‌మెన్‌పేట కంబరామాయణ వీధికి చెందిన ముత్తుకుమార్‌ (32) మణిముత్తారు 9వ బెటాలియన్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పాళై కృష్ణన్‌కోవిల్‌ వీధికి చెందిన బంధువు మదియళగన్‌ కుమార్తె జయసూర్య (23)తో 2019 జనవరి 30వ తేదీ వివాహం జరిగింది.

కంబరామాయణ వీధిలో కాపురం పెట్టారు. ముత్తుకుమార్‌ తల్లిదండ్రులు కింద అంతస్తులో నివసిస్తున్నారు. ఇలావుండగా ముత్తుకుమార్‌ కేరళలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల భద్రతకు వెళ్లారు. ఆదివారం ఉదయం జయసూర్య చీరతో ఉరేసుకుని మృతిచెందింది. ఆమె మృతిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పాళయంకోటై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top