
సుశీల (ఫైల్)
ముషీరాబాద్: ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తికి చెందిన బ్రహ్మాచారి, సుశీల(26) దంపతులు బతుకుదెరువు నిమిత్తం నాలుగేళ్ల నగరానికి వచ్చారు. గాంధీనగర్‌లోని పురుషోత్తం ఆపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అదే ఆపార్ట్‌మెంట్‌లోని 203 ప్లాట్‌లో ఉంటున్న ఆస్లాం కుటుంబం విజయవాడకు వెళుతూ తాళం చెవులు వారికి అప్పగించి వెళ్లారు. గురువారం సాయంత్రం సదరు ఫ్లాట్‌లోకి వెళ్లిన సుశీల ఫ్యాన్ హుక్కుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.