అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చిన్నారి సజీవదహనం | Women Live burning to five years child in karnataka | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చిన్నారి సజీవదహనం

Nov 30 2017 9:09 AM | Updated on Apr 4 2019 5:20 PM

Women Live burning to five years child in karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు(బెళగావి): తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందేమోనన్న అనుమానంతో ఐదేళ్ల చిన్నారిని ఓ మహిళ సజీవంగా దహనం చేసిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు...బెళగావి జిల్లాలోని హీరేబెళకట్టి గ్రామానికి చెందిన శివప్ప, రేణుకల సంతానం రాజేశ్వరి(5). వీరి ఇంటికి ఎదురుగా నిర్మల(32) అనే మహిళ  నివాసం ఉంటోంది. ఈమె రాజేశ్వరిని రెండు రోజుల క్రితం బహిర్భూమికని చెబుతూ వెంట తీసుకెళ్లింది.  పొదల్లోకి వెళ్లిన తరువాత  వెంట తెచ్చిన కిరోసిన్‌ను చిన్నారి రాజేశ్వరిపై పోసి నిప్పంటించింది. అనంతరం నిర్మల పారిపోయింది. పాప కేకలు విన్న గ్రామస్తులు చిన్నారని హుటాహుటిన సమీపంలోని ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

ఈ కేసు విచారణను ప్రారంభించిన పోలీసులు నిర్మలను విచారించగా చిన్నారి తండ్రి శివప్పతో నిర్మలకు అక్రమ సంబంధం ఉందని, ఈ విషయాన్ని రాజేశ్వరి చూసిందని,  తమ అక్రమ సంబంధానికి ఆ చిన్నారి అడ్డొస్తుందేమోనన్న భయంతో ఈ పని చేశానని చెప్పినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement