లడ్డూలతో చోరీ | Women Arrest in Robbery Case Tamil Nadu | Sakshi
Sakshi News home page

లడ్డూలతో చోరీ

Jan 3 2020 11:13 AM | Updated on Jan 3 2020 11:13 AM

Women Arrest in Robbery Case Tamil Nadu - Sakshi

అరెస్టయిన రాణి

టీ.నగర్‌: తిరుచ్చి సెంట్రల్‌ బస్టాండ్‌లో మత్తు లడ్డూలు ఇచ్చి, ప్రయాణికుల వద్ద చోరీలకు పాల్పడుతున్న మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా తిరువైయ్యారు సమీపాన గల రంగనాథపురం ప్రాంతానికి చెందిన షణ్ముగం భార్య పార్వతి (50). ఈమె తిరుపూర్‌ జిల్లా పల్లడంలో బనియన్‌ కంపెనీలో పనిచేస్తోంది.  గత జూన్‌ 27వ తేదీ తిరుచ్చి సెంట్రల్‌ బస్టాండ్‌ నుంచి పల్లడం వెళుతుండగా, పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికురాలికి స్వామి ప్రసాదంగా మత్తు లడ్డూను అందజేసింది. ఆ తర్వాత స్పృహ తప్పిన ఆమె ధరించి ఉన్న 8.5 సవర్ల నగలను అపహరించి పరారైంది. బుధవారం తిరుచ్చి నుంచి కోవైకు వెళ్లేందుకు పార్వతి అక్కడికి రాగా, నగలు చోరీ చేసిన మహిళను గుర్తించి అక్కడి పోలీసులకు అప్పగించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement