గోవా హోటల్‌లో శవమై తేలిన మహిళ | Woman Tourist Found Murdered In Goa Hotel Room | Sakshi
Sakshi News home page

గోవా హోటల్‌లో శవమై తేలిన మహిళ

Apr 28 2019 11:30 AM | Updated on Apr 28 2019 2:31 PM

Woman Tourist Found Murdered In Goa Hotel Room - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

హోటల్‌  రూంలో శవమై తేలిన మహిళ

పనాజి : గోవాలోని ఓ స్టార్‌ హోటల్‌లో పాతికేళ్ల మహిళ శనివారం దారుణ హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. బాధితురాలిని హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అల్కా సైనీగా గుర్తించారు. ఈనెల 20న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అర్పోరా బీచ్‌ విలేజ్‌లోని హోటల్‌లో ఆమె దిగారని, అయితే బాయ్‌ఫ్రెండ్‌ కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. ఆమె గదిలోకి వెళ్లిన హోటల్‌ మెయింటెనెన్స్‌ సిబ్బందికి మహిళ విగతజీవిగా కనిపించిందని, ఆమె మెడపై కత్తి గాట్లు ఉన్నాయని గుర్తించామని పోలీసులు తెలిపారు.

పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పనాజీ సమీపంలోని గోవా మెడికల్‌ కాలేజ్‌కు తరలించారు. బాధితురాలి మృతదేహాన్ని గుర్తించే ముందు రూమ్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల కోసం బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌ సహా బార్డర్‌ చెక్‌పోస్ట్‌ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. బాధితురాలిని బాయ్‌ఫ్రెండ్‌ హతామార్చాడా లేక దుండగుల పనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement