అనుమానాస్పద స్థితిలో మహిళ.. | Woman in Suspicious Died | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ..

Apr 6 2018 8:56 AM | Updated on Apr 6 2018 8:57 AM

Woman in Suspicious Died - Sakshi

కవిత మృతదేహం

గూడూరు : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన గూడూరు శివారు తోటదస్రుతండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గీసుకొండ మండలం నంద్యానాయక్‌ తండాకు చెందిన కేలోతు ఈర్యా, ఈరమ్మల కూతురు కవిత(26)ను గత ఎనిమిది సంవత్సరాల క్రితం గూడూరు శివారు తోటదస్రుతండాకు చెందిన తేజావత్‌ లాల్‌సింగ్‌తో వివాహం చేశారు. కట్నకానుకలు అన్నిముట్టచెప్పిన తర్వాత లాల్‌సింగ్‌ మరో రూ. 70 వేలు ఇవ్వాలంటూ గత రెండు రోజుల క్రితం భార్య కవితను తీసుకుని నందనాయక్‌తండాకు చేరుకున్నాడు. అక్కడ అ త్తామామలను డబ్బులు అడగుగా మీకిచ్చే డబ్బులు అన్నీ ఇ చ్చామని, కావాలంటే మరికొన్ని డబ్బులు తర్వాత చెప్పా రు.

దీంతో కోపోద్రిక్తుడైన లాల్‌సింగ్‌ గురువారం మధ్యాహ్నం దస్రుతండాకు బయలుదేరాడని, ఇంతలోనే ఈ ఘట న జరిగిందని వాపోయారు.  అత్తింటి వారే తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుం బ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా పురుగుల మందు తాగి కవిత ఆత్మహత్య చేసుకుందని లాల్‌సింగ్‌ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇదే విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోగా  ఎస్సైలు యాసిన్, రామారావు సిబ్బందితో చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement