పెళ్లివారింట విషాదం | Woman Died in Road Accident Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లివారింట విషాదం

Nov 7 2019 11:08 AM | Updated on Nov 7 2019 11:08 AM

Woman Died in Road Accident Hyderabad - Sakshi

అంబాజీపేట (పి.గన్నవరం): బంధువులు.. స్నేహితులతో కళకళాడాల్సిన పెళ్లి వారింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 9న నిర్వహించే వివాహానికి సంబంధించి పెళ్లి కొడుకును చేసే సమయంలో బాజభజంత్రీలతో మార్మోగాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. బంధువులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన పోచిరాజు శేషగిరిరావు, లక్ష్మి దంపతులు తూర్పుగోదావరి జిల్లా, అంబాజీపేటలో ఉంటున్న తమ బావ సూర్యనారాయణ మనవడి వివాహానికి హాజరయ్యేందుకు ప్రైవేటు వాహనంలో బయలుదేరారు. కొత్తపేట మండలం, మోడేకుర్రు సమీపంలో ఐషర్‌ వ్యాన్‌ను వీరు ప్రయాణిస్తున్న వ్యాగనార్‌ కారు బలంగా ఢీ కొట్టడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమలాపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ  లక్ష్మి మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియడంతో పెళ్లివారి ఇళ్లు శోకసముద్రంలో మునిగిపోయాయి. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన శేషగిరిరావు  హైకోర్టులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. వనస్థలిపురంలో ఉంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement