కన్నతల్లి కర్కశత్వం.. నోట్లో గుడ్డలు కుక్కి..

Woman Brutally Kills Her Two Sons in Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట : కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా కడతేర్చింది. సొంత బిడ్డలన్న కనికరం లేకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. బీరు సీసాతో దాడి చేసి హతమార్చింది. సిద్దిపేటలోని గణేశ్‌నగర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని గణేశ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న సరోజ అనే మహిళ కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలు ఆర్యన్ (5), హర్షవర్ధన్ (రెండున్నరేళ్లు)లను అతి కిరాతంగా చంపింది. ఈ హత్యకు భార్యాభర్తల మధ్య గొడవలే  కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం సరోజ కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. పిల్లల మృతదేహాలను చూసి తండ్రి రోదించడం.. స్థానికులను కంటతడి పెట్టించింది. ఇక సరోజను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top