ఏసీబీ వలలో ‘వుడా’ అదనపు చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ | "vuda" officer cought by ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ‘వుడా’ అదనపు చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌

Jan 29 2018 11:54 AM | Updated on Aug 17 2018 12:56 PM

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ అవినీతి తిమింగలం ఏసిబి వలలో చిక్కింది.‘వుడా’లో అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్‌గా పనిచేస్తున్నపసుపర్తి ప్రదీప్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. దస్పల్లా హిల్స్‌లోని ఆయన నివాసం నటరాజ్‌ టవర్స్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 12చోట్ల హైదరాబాద్‌, అనంతపురం, ఒంగోలు, విశాఖ, విజయవాడల్లోని తండ్రి, కుమారుడు, మామగారు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సోదాలలో వెలుగు చూస్తున్న అక్రమ ఈ ఆస్తుల విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా. ప్రదీప్‌ కుమారుడి పేరుతో హెచ్‌ఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఉన్నట్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement