ఎస్‌ఐ వేధింపులు తాళలేక | Two Young Men Suicide Attempt In Police Station | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ వేధింపులు తాళలేక

Mar 29 2018 10:53 AM | Updated on Sep 2 2018 3:51 PM

Two Young Men Suicide Attempt In Police Station - Sakshi

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దస్తగిరి , మనోహర్‌

తాడిపత్రి: చేయని నేరాన్ని బలవంతంగా ఒప్పించేందుకు ఓ ఎస్‌ఐ యత్నించడంతో ఇద్దరు వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌ ఎదటే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద చోటు చేసుకుంది. మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి చెందిన దస్తగిరి, మనోహర్‌ అనే వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వెంకటరెడ్డిపల్లిలో కొద్ది రోజుల క్రితం గొర్రెలు చోరీకి గురయ్యాయి. అయితే ఈ నేరం ఒప్పుకోవాలని గ్రామానికి చెందిన దస్తగిరి, మనోహర్‌ అనే వ్యక్తులను రూరల్‌ ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు.

గొర్రెలను దొంగతనం చేశామని ఒప్పుకోవాలని దస్తగిరి, మనోహర్‌కు దేహశుద్ధి చేశారు. తాజాగా బుధవారం ఉదయం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట దస్తగిరి, మనోహర్‌లు పోలీసుల వేధింపులు తాళలేక పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న వారు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మనోహర్‌ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గొర్రెలను తామే దొంగిలించామని, వాటికయ్యే నగదు చెల్లిస్తామని దస్తగిరి, మనోహర్‌ చెప్పినట్లు ఎస్‌ఐ ‘సాక్షి’కి తెలిపారు. డబ్బు చెల్లించాల్సి వస్తుందనే ఆత్మహత్యాయత్నం చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement