
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌజ్ పరిధిలోని మూసీనదిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. మహిళలను చంపిన దుండగులు మృతదేహాలను మూసీ నదిలో పారేశారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి మహిళల హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తలపై బలమైన గాయాలు ఉండటంతో క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారని పోలీసులు అనుమానిస్తునారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.