కారును ఢీకొన్న లారీ; ఇద్దరి మృతి | Two People Died In Road Accident In Nellore | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

Jun 26 2019 10:15 AM | Updated on Jun 26 2019 10:15 AM

Two People Died In Road Accident In Nellore - Sakshi

సాక్షి, నగరి(నెల్లూరు): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి మండలంలోని తడుకుపేట వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జునరావ్‌ వివరాల మేరకు.. తిరుత్తణికి చెందిన మోహన మురళి (40), డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం నెల్లూరులో జరిగిన తన బంధువుల పెళ్లికి హాజరై నెల్లూరులోని తన స్నేహితుడి తల్లి సరీమా(60)ను వెంటబెట్టుకొని తిరుత్తణికి కారులో బయల్దేరారు. కొన్ని నిమిషాల్లో తిరుత్తణికి చేరుకోవాల్సి ఉండగా మృత్యువు లారీరూపంలో వారిని కబళించింది. మండలంలోని తడుకుపేట వద్ద నగరి వైపు వస్తున్న లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. ప్రమాదంలో కారులోని మోహనమురళి, సరీమా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement