ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి | Two GHMC employees Died In Accident Near MGBS | Sakshi
Sakshi News home page

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

Aug 6 2019 8:48 PM | Updated on Aug 6 2019 9:08 PM

Two GHMC employees Died In Accident Near MGBS  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంజీబీఎస్‌ కేంద్రంలో చెత్త తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు ఉద్యోగులు మంగళవారం మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ ప్రభుత్వ ఉద్యోగి హెల్పర్‌ ఆరీఫ్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి హాజిఖాన్‌.. విధుల్లో ఉండగా భారీ వాహనం ఒక్కసారిగా వెనుకకు రావడంతో ఈ ఘటన సంభవించింది.

ఈ దుర్ఘటనపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ దానకిషోర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేయర్‌.. ప్రభుత్వ ఉద్యోగి ఆరీఫ్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. అంతేగాక ఇరు కుటుంబాలకు పింఛను సదుపాయం కల్పిస్తామని మేయర్‌  భరోసానిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement