ఘోర ప్రమాదం.. మహిళా, చిన్నారి మృతి | Two Died In Car Auto Collision At Pedapadu In West Godavari District | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. మహిళా, చిన్నారి మృతి

Sep 16 2019 8:31 AM | Updated on Sep 16 2019 9:00 AM

Two Died In Car Auto Collision At Pedapadu In West Godavari District - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పెద్దపాడు మండలం ఏపూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు  ఢీకొట్టిన ఘటనలో మహిళతో పాటు ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement