టిక్‌టాక్‌ స్టార్‌ ఆత్మహత్య.. అనుమానాలు

TikTok Star Siya Kakkar Is No More - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టిక్‌టాక్‌ సెన్సేషన్‌, డ్యాన్సర్‌ సియా క​క్కర్‌(16) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ప్రీత్‌ విహార్‌లోని ఆమె సొంత నివాసంలో బలవన్మరణానికి పాల్పడినట్లు సియా వ్యక్తిగత మేనేజన్‌ అర్జున్‌ అధికారికంగా ధృవీకరించారు. సోషల్‌ మీడియాలో లక్షల్లో ఫాలోయింగ్‌ కలిగిన ఆమె ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో కారణాలు తెలియదన్నారు. అయితే సియా కక్కర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత ప్రముఖ బాలీవుడ్‌ ఫోటోగ్రాఫర్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అంతేకాకుండా ఆమె మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.

‘అద్భుత ప్రతిభ కలిగిన సియా ఎందుకు బలవన్మరణానికి పాల్పడింతో తెలియదు. ఆమె చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మంచి భవిష్యత్‌ ఉందని నాతో పాటు మా టీం సభ్యులందరం అనుకున్నాం. బుధవారం రాత్రి కూడా ఆమెతో మాట్లాడా. మామూలుగానే మాట్లాడింది. కానీ ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు’ అని మేనేజర్‌ అర్జున్‌ అన్నారు. సియా ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక సోషల్‌ మీడియా యూజర్లకు సియా కక్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తారు. సియాకు ఇన్‌స్టాలో 104కే, టిక్‌టాక్‌లో 1.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉండట విశేషం. డ్యాన్స్‌లతో, నటనతో అభిమానులను అలరించిన 16 ఏళ్ల సియా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త టిక్‌టాక్‌ యూజర్లను షాక్‌కు గురిచేసింది. అయితే ఆమె అత్మహత్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

And Its TIME to get knocked out by this lethal combination of an Epic Punjabi Song and an enchanting beauty. Watch the King of Desi Hip-Hop Bohemia, soulful singer JS Atwal along with Lola Gomez in the official video of Our Latest Single, "Sharaabi Teri Tor". The Most Awaited Song of 2020 is OUT !! Watch the Video Now. . . . @iambohemia @atwalinsta @lolitaxo__ @mbmusicco @meetbrosofficial @meet_bros_manmeet @harmeet_meetbros @shaxeoriah @urshappyraikoti @jaggisim @desihiphopking @touchblevins @raajeev.r.sharma @itsumitsharma @psycho_marketer @fameexpertz #SharaabiWalk #SharaabiWalkChallenge #SharaabiTeriTor #Bohemia #HipHop #Rap #Punjabi #JsAtwal #HappyRaikoti #intoxicating #MBMusic #sharaab #musicvideo #fameexpertz

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

1 or 2? ✨

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top