ముగ్గురికి రెండు యావజ్జీవ కారాగారశిక్షలు..

three person get double life imprisonment for murder  - Sakshi

ముగ్గురి హత్య కేసు నేపథ్యం

సాక్షి, అన్నానగర్‌: దంపతులతో సహా ముగ్గురి హత్య కేసులో అన్న, తమ్ముడు సహా ముగ్గురికి రెండు యావజ్జీవకారాగార శిక్షలు విధిస్తూ తొడుంబుళా కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దిండుక్కల్‌ జిల్లా అడియాలి నగర్‌ లా హాస్టల్‌ నడుపుతూ వచ్చిన కుంజుమహ్మద్‌ (65), ఇతని భార్య ఆయిషామ్మా (60), అత్త నాచ్చి (85) హత్యకు గురయ్యారు. ఆయిషామ్మా, నాచ్చిల నగలు కనపడలేదు. దీనిపై అడియాలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

అప్పుడు ఆ హాస్టల్‌లో ఉంటున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్ర (23), రాకేష్‌ గౌడ (26), మంజునాథ్‌ (21) ముగ్గురు యువకులు నగలు, నగదుకి ఆశపడి వారిని హత్య చేసి పరారైనట్లు తెలిసింది. అనంతరం పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తొడుబుళా కోర్టులో జరుగుతూ వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి శుక్రవారం హత్య కేసులో అరెస్టు అయిన ముగ్గురికి రెండు యావజ్జీవ కారాగారశిక్షలు, తలా రూ.27 వేల 500 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top