ప్రాణం మీదకు తెచ్చిన సెరిలాక్‌ | three months child death with Cerelac struck in throat | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదకు తెచ్చిన సెరిలాక్‌

Feb 1 2018 8:13 AM | Updated on Feb 1 2018 8:13 AM

three months child death with Cerelac struck in throat - Sakshi

విషాదంలో పాప తల్లి

రామనగర (దొడ్డబళ్లాపురం): గొంతులో సెరిలాక్‌ ఇరుక్కుపోవడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన బెంగళూరు సమీపంలోని మాగడి పట్టణంలో బుధవారం జరిగింది. హోసపాళ్యలో నివసిస్తున్న మంజునాథ్, ధనలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమార్తె సంతానం. వీరు చిన్నారికి 15 రోజులు కిందట సెరిలాక్‌ తినిపించడం ఆరంభించారు.

బుధవారం ఉదయం చిన్నారికి సెరిలాక్‌ కలిపి తల్లి తినిపిస్తుండగా..అది గొంతులో ఇరుక్కోవడంతో శిశువు ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పపత్రికి తీసుకెళ్లగా గొంతులో సెరిలాక్‌ ఇరుక్కోవడంతో  ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement