
సాక్షి, జనగామ : జిల్లాలోని దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వెళుతున్న డీసీఎం వ్యాను, కారు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబాబాద్‌కు చెందిన వ్యాపారి పెనుగొండ గణేష్, సుకన్య ,మహమ్మద్ నజీర్(కారు డ్రైవర్)గా గుర్తించారు. మంజుల, శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.