ఆనందనగర్‌ కాలనీలో భారీ చోరీ | theft in architects house | Sakshi
Sakshi News home page

ఆనందనగర్‌ కాలనీలో భారీ చోరీ

Dec 26 2017 6:19 PM | Updated on Sep 4 2018 5:32 PM

సాక్షి, హైదరాబాద్‌ : పంజగుట‍్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆనందనగర్‌లో భారీ చోరీ జరిగింది. ఆర్కిటెక్ట్  సుజాత ఆనందనగర్‌లో కాపురం ఉంటోంది. ఇటీవల ఆమె విదేశాలకు వెళ్ళింది. మంగళవారం ఉదయం నగరానికి వచ్చింది. ఇంట్లో చూడగా 60 తులాల బంగారు నగలు, వజ్రాభారణాలు కనిపించలేదు. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన ఆమె పంజగుట‍్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement