తుపాకీని రూ.లక్షకు విక్రయించాం

Testimony of arrested accused - Sakshi

అరెస్టయిన నిందితుల వాంగ్మూలం

టీ.నగర్‌: మధ్యప్రదేశ్‌లో రూ.30వేలకు తుపాకీ కొనుగోలు చేసి తమిళనాడులో రూ.లక్షకు విక్రయించినట్లు తుపాకీల విక్రయం కేసులో నింది తులు మంగళవారం పోలీసులకు వెల్లడించారు. అస్సాం, గువాహటి నుంచి చెన్నై సెంట్రల్‌కు వచ్చిన రైల్లో తుపాకులు, నకిలీ కరెన్సీ, మత్తు పదార్థాలు తరలిస్తున్న చెన్నై పెరంబూరుకు చెందిన కమల్‌ (26), తిరుమంగళంకు చెందిన ప్రదీప్‌ (28)లను గత 26వ తేదీ చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.వీరిచ్చిన సమాచారం మేరకు తంజావూరు పోలీసులు గత 27న తిరుచ్చి లాడ్జిలో తుపాకులతో బస చేసిన చెన్నై నమ్మాళ్వారుపేటకు చెందిన కానిస్టేబుల్‌ పరమేశ్వరన్‌ (34), అతని సహాయకుడు నాగరాజ్‌ (30) తంజావూరు జిల్లా తిరుసిట్రంబళం ప్రాంతానికి చెందిన శివ (32) ను అరెస్టు చేసి వారినుంచి రెండు తుపాకులు, 10బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వారందరిని తిరుచ్చి సెంట్రల్‌ జైల్లో నిర్బంధించారు. తిరుచ్చిలో గల పారిశ్రామికవేత్తకు తుపాకీ విక్రయిస్తుండగా పరమేశ్వరన్‌తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. అలాగే ఈ కేసులో మరియ ప్రకాష్, దివ్యశేఖర్‌ ఎట్టయప్పన్‌లను అరెస్ట్‌ చేసి ఈ నెల 3వ తేదీ కోర్టులో హాజరుపరిచి జైల్లో నిర్బంధించారు. ఇలా ఉండగా ఈ కేసు సీబీసీఐడీ పోలీసులకు బదిలీచేస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు ఇచ్చా రు. ఈ కేసుౖలో జైల్లో ఉన్న నిందితులు మంగళవారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మధ్యప్రదేశ్‌లో రూ.30వేలకు తుపాకీ కొనుగోలు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చి రూ.లక్షకు విక్రయించినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top