తండ్రి కళ్లెదుటే కొడుకు మృతి | tenth class student death in road accident | Sakshi
Sakshi News home page

తండ్రి కళ్లెదుటే కొడుకు మృతి

Feb 23 2018 7:33 AM | Updated on Aug 30 2018 4:20 PM

tenth class student death in road accident - Sakshi

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ప్రవీణ్‌ కుమార్‌ ,గాయపడిన వృద్ధుడు మాణయ్య

మంచాల: రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని ఆగాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పో లీసుల కథనం ప్రకారం.. మాల్‌ గ్రామానికి చెందిన పల్లేటి చంద్రయ్య వృత్తి రీ త్యా ఆర్టీసీ డ్రైవర్‌. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోని ఎన్టీఆర్‌ నగర్‌లో ఉం టున్నాడు. చంద్రయ్య కుమారుడు పల్లే టి ప్రవీణ్‌ కుమార్‌(21). కాగా ప్రవీణ్‌కుమార్‌ పదో తరగతి పరీక్ష ఫీజు కట్టడానికి తండ్రి చంద్రయ్యతో కలిసి హీరో హోం డా స్లె్పండర్‌పై మాల్‌ వైపు వెళ్తున్నారు. ఆగాపల్లి వద్దకు రాగానే మాల్‌ నుండి హైదరాబాద్‌ వెళ్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌ కుమార్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రయ్యను చికిత్స నిమిత్తం నగరంలోని కామినేని వైద్యశాలకు తరలించారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. కళ్లముందే కొడుకు మరణించడంతో చంద్రయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

మరో ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు  
యాచారం: నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు... నగరంలోని బా లాపూర్‌కు చెందిన నారాయణ, అతని కు మారుడు వినయ్‌కుమార్‌ గురువారం మధ్యాహ్నం  మాడ్గుల్‌ మండలం ఇర్విన్‌ గ్రామానికి వెళ్లి తిరిగి నగరానికి బైకుపై బయలుదేరారు. సాగర్‌రోడ్డు బాలగ్రా మ్‌ వద్దకు రాగానే యాచారం నుంచి మా ల్‌ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న నారాయణ, అతని కుమారుడు వినయ్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటయ్య తెలిపారు.

బైకు ఢీకొని వృద్ధుడికి తీవ్రగాయాలు  
పరిగి: ప్రమాదవశాత్తు చేయి విరిగిన మనవడికి కట్టు కట్టించేందుకు వస్తే తాతకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి సమీపంలోని మల్లెమోనిగూడ దారిలో గురు వారం చోటు చేసుకుంది. వివరాలు.. దోమ మండల పరిధిలోని దిర్సంపల్లికి చెందిన బాలుడు మొగులయ్య(13)కు ఇటీవల ప్రమాదంలో గాయమై చేయి విరిగింది. కాగా అతని చేయికి కట్టుకట్టించేందుకు గురువారం తాత మాణయ్య(70) పరిగి మండలం మల్లెమోనిగూడ సమీపంలోని ఓ నాటు వైద్యుడిని అశ్రయించారు. అక్కడ కట్టు కట్టించుకుని తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన పల్సర్‌ బైక్‌ ఢీకొంది. దీంతో మాణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా కేసు నమోదు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement