ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా 

TDP Leaders Pre Planned Script To Commit Suicide To Blame Government In Anantapur - Sakshi

సాక్షి, రాయదుర్గం :  సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీకి మైండ్‌బ్లాక్‌ అయ్యింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ జనరంజక పాలనతో దూసుకుపోవడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ పార్టీని బతికించుకునేందుకు నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇంటి స్థల సమస్యను సాకుగా చూపి వైఎస్సార్‌సీపీ నాయకులకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు టీడీపీ కార్యకర్త ద్వారా ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరలేపారు.

గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జయరామిరెడ్డి తనకు మంజూరు చేసిన ఇంటి పట్టాకు సంబంధించి అధికారులు స్థలం చూపలేదంటూ సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేసిన ఆత్మహత్యాయత్నం డ్రామా అని తేలింది. నీటితో నింపిన పురుగుమందు డబ్బాను వెంట తెచ్చుకుని గుటగుటా తాగేయగా.. భార్య పల్లవి సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ డ్రామాను రక్తి కట్టించింది.

రాసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం సమస్యకు కారణం వైఎస్సార్‌సీపీ నాయకులే అంటూ పేర్లు చెప్పడానికి ప్రాధాన్యత ఇచి్చంది. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కనీసం వెంట కూడా పోకుండా కార్యాలయం ముందే కూర్చోవడం, కంటిలో నీరు కూడా రాకపోవడం అక్కడున్న వారు చూసి ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చర్చించుకోవడం కనిపించింది.  

టీడీపీ నాయకుడి అత్యుత్సాహం 
టీడీపీ మండల నాయకుడు రాఘవరెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపినట్లు తెలిసింది. టీడీపీ  హయాంలో జరిగిన తప్పిదాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టాలని కుయుక్తులు పన్నాడు. ఆ కుట్రల్లో భాగంగా సంఘటన జరగడానికి గంట  ముందే  తనకు కావాల్సిన మీడియా వారికి ఫోన్‌ చేసి ‘గుమ్మఘట్ట తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లండి, జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్యాయత్నం చేస్తున్నాడం’టూ సమాచారమందించాడు. అంతటితో ఆగ కుండా వైఎస్సార్‌సీపీ నాయకుల పేర్లు చెప్పాలం టే రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు సూచించడం అక్కడున్నవారందరూ గుర్తించారు. 

అడ్డు తగులుతున్న మాజీ మంత్రి
బీటీపీకి చెందిన జయరామిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అనుచరుడు. టీడీపీ కార్యకర్తకు స్థలం ఇప్పించడంలో కూడా మంత్రి కాలవ శ్రీనివాసులు అడ్డు తగులుతున్నాడని 2018 ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల పర్యటనలో భాగంగా ఆరోపణలు గుప్పించాడు. చివరకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి మేరకు 2018 జూన్‌లో జయరామిరెడ్డికి పట్టా ఇప్పించారు. అయితే ఆ పట్టాలో చెక్కుబందీ సరిగా పొందుపరచలేదు. స్థలం చూపాలంటూ జయరామిరెడ్డి పలుమార్లు ప్రయతి్నస్తే అప్పటి మంత్రి కాలవ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పూల నాగరాజు అడ్డుపడ్డారు. అప్పటి నుంచి జయరామిరెడ్డి సమస్య సమస్యగానే మిగిలిపోయింది.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top