అనుమానంతో..భార్య గొంతుకోసి తానూ... | Suicide Attempt In Kurnool | Sakshi
Sakshi News home page

అనుమానంతో..భార్య గొంతుకోసి..తానూ

Jun 3 2018 8:28 AM | Updated on Nov 6 2018 8:16 PM

Suicide Attempt In Kurnool - Sakshi

గాయపడిన ఎస్తేరి, చికిత్స పొందుతున్న కృష్ణ

కర్నూలు(హాస్పిటల్‌) : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమె గొంతు కోయడంతోపాటు తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల వివరాల మేరకు.. మిడుతూరుకు చెందిన ఎస్తేరి(30)తో గార్గేయపురానికి చెందిన కృష్ణ(35)కు పదేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణ సెంట్రింగ్‌ పనికి, భార్య కూలీకి వెళ్లేవారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. దాదాపు 8 నెలల నుంచి వీరు కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని ఎస్తేరి తల్లి సుంకులమ్మ ఇంట్లో ఉంటున్నారు. కొద్దికాలంగా భర్త..  భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

తన భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటోందని భావించి వేధించేవాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో కృష్ణ చేతిలో ఉన్న కత్తితో భార్య గొంతుకోశాడు. అదే సమయంలో కత్తితో తానూ గొంతు కోసుకున్నాడు. వెంటనే స్థానికులు, కుటుంబసభ్యులు వారిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గొంతు వద్ద గాయాలు లోతుగా కాకపోవడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. ఈమేరకు కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement