సినీ నిర్మాత కారు అపహరణ

South Cinema Producer Car Robbery In Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: పూందమల్లిలో డ్రైవర్‌పై దాడి చేసి సినీ నిర్మాతకు చెందిన కారును చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూందమల్లి, వేలప్పన్‌ చావడికి చెందిన రామచంద్రన్‌ (70). తెలుగు, కన్నడం సినీ నిర్మాత ఇతని కారు డ్రైవర్‌ చంద్రన్‌ (24). బుధవారం రాత్రి రామచంద్రన్‌ బంధువులను సెంట్రల్‌ నుంచి తీసుకురావడానికి చంద్రన్‌ కారులో వెళుతున్నారు.

కొద్ది దూరం వెళ్లిన తరువాత ఐదుగురికి చెందిన ఓ ముఠా కారును నిలిపి నజ్రత్‌పేటకు వెళ్లాలని కోరారు. చంద్రన్‌ వారికి సమాధానం చెప్పేలోపు వారు చంద్రన్‌పై దాడి చేసి అతన్ని కింద పడదోసి కారు సహా పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top