కొడవలితో కొడుకు, కోడలు దాడి 

Son Attack On His Father - Sakshi

ఇద్దరిపై కేసు నమోదు  

శాంతినగర్‌(అలంపూర్‌) : కన్నతండ్రిపై కొడవలితో దాడిచేసి గాయపరిచిన కుమారుడు, కోడలిపై కేసు నమోదైన సంఘటన వడ్డేపల్లి మండలంలోని జిల్లెడిదిన్నెలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లెడిదిన్నెకు చెందిన ఖాసీమన్న వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్నాడు. అదే పొలంలో కుమారుడు రాఘవేంద్ర, కోడలు సంజమ్మ పొలం పనులు చేసుకుంటూ గొడవపడ్డారు.

ఈ క్రమంలో రాఘవేంద్ర తన చేతిలోని కొడవలితో తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. సంఘటనలో ఖాసీమన్న కుడిచేయి మూడు వేళ్లకు గాయమై రక్తస్రావమైంది. ఈ విషయమై శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఖాసీమన్న ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుమారుడు, కోడలుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ మూర్తి పేర్కొన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top