సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య | Software engineer murdered by unknown people in Bangalore | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య

Oct 9 2017 5:54 PM | Updated on Oct 22 2018 7:50 PM

Software engineer murdered by unknown people in Bangalore - Sakshi

సాక్షి, బెంగళూరు : బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మడివాళ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న తావరకెరెలోని చాక్లెట్‌ ఫ్యాక్టరీ వద్ద సోమవారం చోటు చేసుకుంది. నగరంలోని అక్సెంచర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న ప్రణవ్‌మిత్ర (26) ఆదివారం రాత్రి తావరెకెరెలో స్నేహితుడి ఇంట్లో పార్టీకి వెళ్లాడు. ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై ఇంటికి బయలుదేరి వస్తుండగా చాక్లెట్‌ ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకుని కత్తితో దారుణంగా పొడిచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ప్రణవ్‌ను సెయింట్‌ జాన్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీసీపీ బోర లింగయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement