ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య | Singareni Employe Suicide Attempt Adilabad | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

Sep 2 2018 1:06 PM | Updated on Sep 2 2018 4:19 PM

Singareni Employe Suicide Attempt Adilabad - Sakshi

పోషయ్య (ఫైల్‌)

శ్రీరాంపూర్‌(మంచిర్యాల): కృష్ణాకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు కనవేని పోషయ్య(56) ఆర్కే 5గని సమీపంలో నీలగిరి తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పోషయ్య మేడిపల్లి ఓసీపీలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య రాధ, కూతుర్లు మల్లేశ్వరి, మౌనిక, కొడుకు మహేందర్‌ ఉన్నారు. స్వస్థలం వరంగల్‌ జిల్లా గొల్లపల్లి మండలం. సింగరేణిలో పని చేస్తూ కృష్ణాకాలనీలోని కంపెనీ క్వార్టర్‌లో నివాసం ఉంటున్నాడు. గత నెల 31న కుటుంబంతో సహా సొంతూరికి వెళ్లాడు. తరువాత ఒక్కడే ఇంటికి వచ్చి సోమవారం డ్యూటీకని బయలు దేరాడు. కాని తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తరువాత అతని ఇంటికి తిరిగిరాని విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అతని ఆచూకీ కోసం వెతకగా అతని బైక్‌ శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న వైన్స్‌షాప్‌ వద్ద లభించింది. దీంతో బెక్‌ను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అతని కోసం గాలించగా శనివారం నీలగిరి తోటలో చెట్టుకు ఉరివేసుకొని శవమై కనిపించాడు. మృతుడు మద్యానికి బానిస అని, డ్యూటీలు కూడా సక్రమంగా చేసే వాడుకాదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ కారణంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానం కలుగుతోంది. ఈ మేరకు శ్రీరాంపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement