సాలార్‌జంగ్‌ మ్యూజియం వద్ద ప్రమాదం | Road Accident At Salarjung Museum In Hyderabad | Sakshi
Sakshi News home page

సాలార్‌జంగ్‌ మ్యూజియం వద్ద ప్రమాదం

Nov 14 2018 8:02 AM | Updated on Nov 14 2018 10:36 AM

Road Accident At Salarjung Museum In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: పాతబస్తీలోని సాలార్‌జంగ్‌ మ్యూజియం వద్ద బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫార్చూనర్‌ కారు అతివేగంగా వస్తూ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని నాంపల్లిలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందినవారే. ఇమ్రాన్‌ అనే వ్యక్తి  విదేశాల నుంచి హైదరాబాద్‌కు బుధవారం వేకువజామున వచ్చాడు. ఇమ్రాన్‌ను స్నేహితులు పికప్‌ చేసుకుని శంషాబాద్‌ నుంచి పాతబస్తీకి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
 



Advertisement
 
Advertisement
Advertisement