
శంకర్ మృతదేహం
దేవరకొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి దేవరకొండ పట్టణ శివారులో చోటుచేసుకుంది. దేవరకొండ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం బొల్లనపల్లి పెద్దతండాకు చెందిన జర్పుల శంకర్(30), కాట్రావత్ కిషన్, కాట్రావత్ కల్యాణ్ కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న తమ బంధువు వివాహానికి హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో దేవరకొండపట్టణ శివారులోకి రాగానే దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్ మృతిచెందాడు. గాయలపాలైన కాట్రావత్ కిషన్, కాట్రావత్ కల్యాణ్‌ను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. శంకర్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.