రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి | Road Accident In Adilabad | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

Apr 30 2018 7:49 AM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident In Adilabad - Sakshi

లొనారే కిశోర్‌ మృతదేహం

సిర్పూర్‌(టి) : రెండు మోటారుసైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కంచర్‌పేట్‌ గ్రామసమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వెంకట్రావుపేటకు చెందిన అన్నదమ్ములు (పెదనాన్న, చిననాన్న కొడుకులు) లొనారే కిశోర్, లొనారే గులాబ్‌రావులు బైక్‌పై కౌటాల మండలంలో జరిగే పెళ్లికి  వెళ్తున్నారు. ఎదురుగా బైక్‌పై వస్తున్న దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన గుజ్జ సురేశ్‌ ఢీకొట్టాడు. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని సిర్పూర్‌(టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిశోర్‌ (35) మృతి చెందాడు. సురేశ్, గులాబ్‌రావు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మంచిర్యాలకు తరలించారు. అక్కడి నుంచి గులాబ్‌రావ్‌ను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కిశోర్‌కు భార్య, కుమారుడు, గులాబ్‌రావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కిశోర్‌ భార్య ప్రస్తుతం గర్భవతి. ఒకే కుటుంబంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిర్పూర్‌(టి) అదనపు ఎస్సై పురుషోత్తం తెలిపారు. 

1
1/1

గాయపడ్డ సురేశ్, గులాబ్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement