‘అఘాయిత్యాలు అరికట్టాలి’ | Police search for Damodar | Sakshi
Sakshi News home page

‘అఘాయిత్యాలు అరికట్టాలి’

May 9 2018 1:27 AM | Updated on Jul 28 2018 8:53 PM

Police search for Damodar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టి, అత్యాచార నిందితుడు దామోదర్‌ను అరెస్ట్‌ చేయాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీటీఏ) అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి మంత్రికి వినతిపత్రం అందజేశారు. గౌలి దొడ్డి గురుకుల ప్రిన్సిపాల్‌ భర్త దామోదర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని అరె స్టు చేయకుండా తప్పించుకు తిరిగే అవకాశం కల్పించారంటూ వాపోయారు.  

ఏప్రిల్‌ 12న  పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చినా ఆదిలాబాద్‌ జిల్లాలోని గురుకుల విద్యార్థినిని రెండు రోజులు ఇంటికి పోనివ్వకుండా దుండగులు గదిలో బంధించి వేధించినట్లు తెలిపారు. జడ్చర్లలో ప్రిన్సిపాల్‌ వేధింపులు భరించలేక ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బాలికల గురుకులాల్లో పురుషులు ఉండకుండా చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని కోరారు.

దామోదర్‌ కోసం పోలీసుల గాలింపు 
గౌలిదొడ్డిలోని గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రిన్సిపాల్‌ భర్త దామోదర్‌ కోసం గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని నెల్లూరుకు వెళ్తున్నానని చెప్పిన దామోదర్‌ అక్కడ కూడా లేడని పోలీసులు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోనే ఉన్నాడని సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement