ఏ ఉద్యోగం రాదనే మనస్తాపంతో.. | Person Died Due To Unemployment In Khammam | Sakshi
Sakshi News home page

ఏ ఉద్యోగం రాదనే మనస్తాపంతో..

Mar 16 2020 9:35 AM | Updated on Mar 16 2020 9:39 AM

Person Died Due To Unemployment In Khammam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పాల్వంచ: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని సీతారాంపట్నంకు చెందిన ఎన్‌ఎండీసీ ఉద్యోగి భాగం మధుసూదన్‌రావు కుమారుడు భరత్‌కుమార్‌(26) శనివారం ఉదయం పొలం దగ్గర నీళ్లు పెట్టి వస్తానని చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం భోజ నానికి కూడా రాకపోవడంతో తండ్రి మధుసూదన్‌రావు పొలం వద్దకు వెళ్లి చూడగా షెడ్డులో ఇనుపపైపుకు తాడుతో ఉరివేసుకుని ఉన్నాడు.

ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కొడుకు ప్రభుత్వం ఉద్యోగం కోసం అనేక పరీక్షలు రాసినా ఏ ఉద్యోగం రాదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి చేసిన ఫిర్యాదుతో ఎస్‌ఐ ప్రవీణ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement