ఠాణాలో తాగి..సెల్ఫీ దిగిన నేతలు | Party Leaders Drunk At kamareddy Police Station | Sakshi
Sakshi News home page

ఠాణాలో తాగి..సెల్ఫీ దిగిన నేతలు

Nov 11 2019 10:26 AM | Updated on Nov 11 2019 10:26 AM

Party Leaders Drunk At kamareddy Police Station - Sakshi

సాక్షి, కామారెడ్డి : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన వివిధ పార్టీల నేతలను శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు ప్రజాసంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అయితే పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే కొందరు నేతలు మద్యం సేవిస్తూ దిగిన సెల్ఫీలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి అధికార పార్టీ నేతల వాట్సాప్‌కు చేరడంతో వారు వాటిని మరింత వైరల్‌ చేశారు. ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీ శ్వేతకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. మాచారెడ్డి పోలీసు స్టేషన్‌కు తరలించిన నేతల్లో కొందరు ఠాణా వెనకవైపున మద్యం తెప్పించుకుని తాగినట్టు ప్రచారం జరిగింది. ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై ఎస్పీ శ్వేతను ‘సాక్షి’ సంప్రదించగా.. ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement