డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం | One Person Died In Hyderabad Road Accident | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం

Jun 9 2018 11:47 AM | Updated on Sep 4 2018 5:48 PM

One Person Died In Hyderabad Road Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22ఏళ్ల విద్యార్థి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలివి.. సంకరపల్లి మండలం మొకీల గ్రామంలో సుభిస్‌ విడ్సర్‌ విల్లాలో అనంత్‌ రెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. అతని కుమారుడు రాహుల్‌(TS07fx3699)బెంజ్‌కారులో ఫిల్మ్‌నగర్‌ నుంచి మణికొండ వైపు వెళ్తున్నాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి మూడు పాల్టీలు కొట్టింది. దీంతో రాహుల్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

అతని హుటాహుటిన దగ్గరల్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాహుల్‌ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.  ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement