అప్పు తీర్చే దారి లేక..   | Old Man Committed Suicide In Medak | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకున్న రైతు

Jul 9 2018 10:28 AM | Updated on Oct 16 2018 3:15 PM

Old Man Committed Suicide In Medak - Sakshi

రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

చిన్నశంకరంపేట(మెదక్‌): అప్పులు తీర్చడానికి దుబాయ్‌ వెళ్లిన కొడుకు ఏజెంట్‌ చేతిలో మోసపోయి తిరిగి వస్తున్నాడని తెలిసిన రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు గొల్ల సత్యనారాయణ తనకున్న ఎకరం భూమిలో సాగు చేస్తూ, కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇద్దరు బిడ్డల పెళ్లి కోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడు.

ఎదిగిన కుమారుడు నవీన్‌ను దుబాయ్‌ పంపి అక్కడ అతను సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చవచ్చని ఆశించాడు. మరో రూ. లక్ష అప్పు చేసి కొడుకును దుబాయ్‌ పంపించాడు. ఏజెంట్‌ చేతిలో మోస పోయిన కొడుకు ఇంటికి వస్తున్నానని ఫోన్‌ చేసి చెప్పాడు.

దీంతో మనస్తాపానికి గురైన సత్యనారాయణ అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్‌ తెలిపారు.



 

Advertisement
 
Advertisement
Advertisement