ప్రియాంక హత్య కేసు: నలుగురు కాదు ఐదుగురు!

New Twist In Priyanka Reddy Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడు నారాయణపేట జిల్లా పొర్లకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డిని బుధవారం రాత్రి షాద్‌నగర్‌ హైవేలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులు.. ఏ–1 మహమ్మద్‌ ఆరిఫ్‌ (26), ఏ–2 జొల్లు శివ (20), ఏ–3 జొల్లు నవీన్‌ (20), ఏ–4 చింతకుంట చెన్నకేశవులు (20)లను పోలీసులు అదుపులోకి తీసుకొని షాద్‌నగర్‌ పీఎస్‌కు తరలించారు. శుక్రవారం రాత్రంతా నిందితులను విచారించారు. ఈరోజు(శనివారం) కోర్టులో ప్రవేశపెట్టి కస‍్టడీకి కోరనున్నారు.

ప్రియాంక ఇంటికి జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు
కాగా, ప్రియాంకారెడ్డి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు కాసేపటి క్రితమే ప్రియాంక ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత
షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు డిమాండ్‌ చేశారు. నినాదాలు చేసుకుంటూ స్టేషన్‌లోకి వచ్చేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా, నిందితులను మెడికల్‌ ఎగ్జామిన్‌ కోసం ఆస్పత్రికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మెడికల్‌ ఎగ్జామిన్‌ తర్వాత నిందితులను షాద్‌నగర్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

చదవండి:

28 నిమిషాల్లోనే చంపేశారు!

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !

నమ్మించి చంపేశారు!

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప.. ప్లీజ్‌ మాట్లాడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top