చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. | New Twist In Dwarka Murder Case Vijayawada | Sakshi
Sakshi News home page

చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త ట్విస్ట్‌..

Nov 12 2019 9:40 AM | Updated on Nov 12 2019 1:25 PM

New Twist In Dwarka Murder Case Vijayawada - Sakshi

సాక్షి, కృష్ణ: విజయవాడలో దారుణ హత్యకు గురైన బాలిక మొవ్వ ద్వారక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నారి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు ప్రకాశ్‌తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్‌లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుంది. బాలిక తల్లికి అతను చాలా సార్లు ఫోన్‌ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాశ్‌ ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే. ( చదవండిపక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు)

Advertisement
 
Advertisement
Advertisement