మోసగించిన బావ | Molestation Case In karimnagar | Sakshi
Sakshi News home page

మోసగించిన బావ

Aug 19 2018 7:27 AM | Updated on Aug 19 2018 7:27 AM

Molestation Case In karimnagar - Sakshi

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఓ బాలిక(16) స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వరసకు మేనబావ అయిన ప్రతాప్‌ఠాకూర్‌ బాలికకు మాయమాటలు చెప్పి మోసగించాడని బాధితురాలి తల్లి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు... స్థానిక ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన బాలికకు, ఒడిశా రాష్ట్రంకు చెందిన ప్రతాప్‌ఠాకూర్‌ వరుసకు మేనబావ అవుతాడు. ఒడిశాలోనే పని చేస్తున్న ప్రతాప్‌ ఠాకూర్‌ ఎన్టీఆర్‌నగర్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలోనే సదరు బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి మోసం చేశాడు.

ఒడిశాకు వెళ్లిపోయిన ప్రతాప్‌ఠాకూర్‌ తిరిగి గోదావరిఖని రాలేదు. ఈ క్రమంలో సదరు బాలిక గర్భం దాల్చింది. కొడుపులో నొప్పిగా ఉంద ని ఈనెల 16న బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భంతో ఉందని తెలియడంతో ప్రసవం జరిపించారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆం దోళనకు గురైన బాలిక తల్లి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రతాప్‌ఠాకూర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement