ఘోరం.. గ్యాంగ్‌ రేప్‌ చేసి మరీ.. | Men Rape And Filmed Women In Rajasthan | Sakshi
Sakshi News home page

ఘోరం.. గ్యాంగ్‌ రేప్‌ చేసి మరీ..

Mar 10 2018 9:20 PM | Updated on Oct 22 2018 6:05 PM

Men Rape And Filmed Women In Rajasthan - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళపై ఆరుగురు యువకులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేశారు. నెల రోజుల తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

బరాన్‌ జిల్లా కోటా ప్రాంతానికి చెందిన  ఓ మహిళా(40) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గత నెలలో పొరుగూరిలో ఉన్న బంధువులను చూసేందుకు తెలిసిన వ్యక్తి చేతన్‌ మీనా(21) సాయం తీసుకుంది. ఆ మహిళను తన బైక్‌పై తీసుకెళ్లిన మీనా సమాస్‌పుర శివార్లో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే తన ఐదుగురు స్నేహితులను అక్కడికి రప్పించాడు.

ఈ క్రమంలో ఆ ఆరుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంటి వద్ద వదిలి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. దాంతో ఆమె విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. కానీ, తాజాగా ఆ వీడియోను దుండగులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు స్థానిక మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement