ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య | MBA Student Commits suicide | Sakshi
Sakshi News home page

ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య

Apr 6 2018 8:34 AM | Updated on Nov 6 2018 8:16 PM

MBA Student Commits suicide - Sakshi

గచ్చిబౌలి: పార్ట్‌టైం జాబ్‌ చేసుకోవాలని అన్న మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఎంబీఏ విద్యార్థి  ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ నదీమొద్దీన్‌ వివరాల ప్రకారం వినోభానగర్‌ షేక్‌పేట్‌కు చెందిన ఎం.జయరాంనాయక్‌(23) అబిడ్స్‌లోని రాజా బహద్దూర్‌ వెంకటరాంరెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.  కాలేజీ ముగిసిన తరువాత పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తే ఆర్థిక భారం తగ్గుతందని అన్న రాజునాయక్‌ మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన జయరాం బుధవారం ఉదయం 8 గంటలు కాలేజీకి వెళుతున్నాని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగిరాలేదు. రాయదుర్గంలోని మల్లన్నగుట్ట వద్ద అతను మృతి చెంది ఉండడాన్ని దేవాలయానికి వెళ్లిన భక్తులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement