కడుపునొప్పి భరించలేక.. | Married Women Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Apr 5 2018 11:02 AM | Updated on Apr 5 2018 11:04 AM

Married  Women Suicide - Sakshi

మృతిచెందిన రోజా

చౌటుప్పల్‌ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండల పరిధిలోని ఎనగంటితండా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కరంటోతు రోజా(27)కు ఇటీవల భరించలేని కడుపునొప్పి వస్తుంది. నొప్పి రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో  తీవ్రఒత్తిడికి గురైన రోజా తన ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. భర్త రాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement