శైలజ (ఫైల్)
జవహర్‌నగర్: ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్మికనగర్‌కు చెందిన మైలవరపు రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు అతనికి ఇద్దరు భార్యలు శైలజ (22), శారద. అందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. తమ స్వగ్రామం బీబీనగర్‌లో వేడుక జరుగుతున్నందున కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వెళ్లగా గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న శైలజ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జవహర్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
