ప్రియుడి చేతిలో వివాహిత.. | Married Woman Set On Fire Dies In Hyderabad | Sakshi
Sakshi News home page

Oct 24 2018 10:54 AM | Updated on Oct 24 2018 12:55 PM

Married Woman Set On Fire Dies In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సంతోష్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదని పగ పెంచుకున్న ఓ కిరాతకుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు.. పంజాబ్‌కు చెందిన సానియాకు ఇదివరకే వివాహమైంది. ఆమె నగరానికి చెందిన సల్మాన్‌తో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా సానియా తనను పట్టించుకోవడం లేదంటూ రగిలిపోయిన సల్మాన్ ఆమెపై కిరోసిన్‌ పోసి సజీవదహనం చేశాడు. అనంతరం సంతోష్‌నగర్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement