 
													ముంబై: మహారాష్ట్రలో రిజర్వేషన్ ఉద్యమ నిరసనలు హింసకు దారి తీశాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని నిరసనకారులు ముట్టడించారు. మరాఠా కోటా డిమాండ్ నేపథ్యంలో బీద్ జిల్లాలోని ఎమ్మెల్యే నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్ వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలోని కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.
ప్రకాశ్ సోలంకి ఇంటి వద్ద భారీగా మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చుట్టుపక్కలా ప్రాంతమంతా దట్టమైన మంటలు వ్యాపించాయి. కాగా ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు, తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు.

అయితే మరాటా రిజర్వేషన్ల ఉద్యమం గురించి సోలంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటిపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ గత అయిదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సోలంకే ఈ దీక్షపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరాఠా రిజర్వేషన్ సమస్యను పిల్లల ఆటగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆగ్రహంతో రగిలిపోయి.. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
చదవండి: ఈడీ ఎదుటకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు
#WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI
— ANI (@ANI) October 30, 2023

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
