అమెరికాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి.. ఐదు నెలల్లో రెండోసారి..

Indian Consulate in San Francisco Set On Fire - Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్‌కోలో ఇండియన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగులు దౌత్య కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత ఐదు నెలల్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. గత మార్చి నెలలోనే ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడి చేశారు. 

దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగగా అగ్ని మాపక సిబ్బంది ‍అప్రమత్తమైంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడినవారి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. అమెరికా అధికార ప్రతినిధి ఈ దాడిని ఖండించారు. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మార్చి లోనే..
మార్చి నెలలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్‌ పాల్ సింగ్‌ కోసం గాలింపు చేపట్టింది ప్రభుత్వం. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్‌కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అమృత్‌పాల్‌ సింగ్‌ను వదిలేయండి అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు నిర్వహించారు. 

ఇదీ చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top