వివాహిత అదృశ్యం | Married woman Disappear in visakhapatnam | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

Mar 3 2018 11:35 AM | Updated on May 3 2018 3:20 PM

Married woman Disappear in visakhapatnam - Sakshi

జి.భారతి(ఫైల్‌)

తగరపువలస(భీమిలి): జీవీఎంసీ భీమిలి జోన్‌ 4వ వార్డు కు చెందిన జి.భారతి(25) అనే వివాహిత అదృశ్యమైంది. గత నెల 28న మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదనిఆమె తల్లి ధనలక్ష్మి శుక్రవారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాణీ విద్యానికేతన్‌ సమీపంలో తల్లితో నివసిస్తున్న భారతికి గతంలో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తితో వివాహమైంది. మూడేళ్ల క్రితం ఆయనతో విడాకులు తీసుకున్నట్టు తెలిసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement